Wed Jan 08 2025 17:55:56 GMT+0000 (Coordinated Universal Time)
Plums : రేగుపండ్ల తినడంతో ఇన్ని ప్రయోజనాలా?
రేగుపండ్లు మార్కెట్ లో ఇప్పుడు పుష్కలంగా లభిస్తున్నాయి. కాస్త ధర ఎక్కువయినా రేగుపండ్లు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి
రేగుపండ్లు.. మార్కెట్ లో ఇప్పుడు పుష్కలంగా లభిస్తున్నాయి. కాస్త ధర ఎక్కువయినా రేగుపండ్లు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. వైద్య నిపుణులే ఈ మాట చెబుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టంగా తినే రేగుపండ్లతో అనేక పోషకాలు మనకు అందుతాయాని అంటున్నారు. రేగుపండు కనిపిస్తే కొనకుండా ఉండొద్దు. రుచికి రుచి. ఆరోగ్యానికి ఆరోగ్యం. పుల్లగా, తియ్యగా నోటికి అన్ని రకాల రుచులను అందించే రేగుపండ్లు ఈ సీజన్ లో తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయని అనేక మంది వైద్యనిపుణులు ఢంకా భజాయించి చెబుతున్నారు.
క్యాన్సర్ కారకాల నుంచి...
రేగుపండ్లు తినడం వల్ల క్యాన్సర్ కారకాలు కూడా దూరమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రేగుపండ్లు ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. చిన్న రేగు పండ్లు శీతాకాలంలోనే ఎక్కువగా లభ్యమవుతాయి. ప్రధానంగా చలికాలంలో వీటిని తినడం వల్ల రోగ నిరోధక శక్తిని మరింత పెంచుతాయని అధ్యయనాలు తేల్చిచెప్పాయి. రేగుపండ్లలో విటమిన్ సి, ఏ పొటాషియంలు ఉండటంతో అవి ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు చెబుతున్నారు. ఈ కాలంలో రేగుపండ్లు తింటే ఎన్నో రకాల ఆరోగ్యకరమైన సమస్యలకు దూరంగా ఉండవచ్చని పలువురు సూచిస్తున్నారు.
చలికాలంలో వ్యాధులు...
సాధారణంగా చలికాలంలో జలుబు, దగ్గు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వీటి నుంచి కాపాడటానికి రేగుపండ్లు ఉపయోగపడతాయి.దీంతో పాటు నిద్రలేమితో బాధపడే వారికి ఇది దివ్య ఔషధం అని అంటున్నారు. నిద్రలేమి నుంచి వీటిని తిన్న తర్వాత బయటపడవచ్చని చెబుతున్నారు. లివర్ కు కూడా రేగుపండ్లు మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రేగుపండ్లు పుల్లన.. ఆరోగ్యం చల్లన అన్న సామెత అందరినోటా వినిపిస్తుంది. మన శరీరంలో ఉండే బ్యాడ్ కొలస్ట్రాల్ ను కూడా రేగుపండ్లు తొలగిస్తాయని అధ్యయనాల్లో తేలింది. జీర్ణశక్తి కూడా మెరుగు పరుస్తుందని చెబుతున్నారు.
ఈ సీజన్ లో లభించే...
కడుపు ఉబ్బరం తగ్గడమే కాకుండా, రక్తం ఉత్పత్తిని కూడా పెంచుతుందని, బాడీ డీహైడ్రేట్ కాకుండా దోహదపడుతుంది. రేగుపండ్లు ఈ సీజన్ లో తింటే విరేచనాలతో బాధపడుతున్న వారు కూడా స్వాంతన పొందుతారని వైద్యులు సూచిస్తున్నారు. కఫము, పైత్యం, వాతం లాంటి సమస్యల నుంచి రేగుపండ్లు కాపాడతాయి. అందుకే ఈ సీజన్ లో లభించే రేగుపండ్లును ప్రతి ఒక్కరూ తిని తమ ఆరోగ్యాన్నిపరిరక్షించుకోవాలని సూచిస్తున్నారు. కాస్త ధర ఎక్కువయినప్పటికీ వాటిని కొనుగోలు చేసి మరీ రుచిచూసి వాటిని తింటే మన ఆరోగ్యానికి ఢోకా లేనట్లే.
Next Story