Sun Dec 22 2024 17:46:39 GMT+0000 (Coordinated Universal Time)
Modi Programs in Hyderabad:హైదరాబాద్ లో భారీ భద్రత.. ప్రధాని మోదీ నేటి పర్యటన ఇలా!!
ప్రధాని నరేంద్ర మోదీ నేడు సంగారెడ్డిలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన
Modi Programs in Hyderabad:ప్రధాని నరేంద్ర మోదీ నేడు సంగారెడ్డిలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా అధికారులు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. పటాన్చెరులో బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభ నేపథ్యంలో ఉదయం ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఉదయం 9:50 నుంచి 10:15 మధ్య రాజ్‌భవన్ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టు మార్గంలో ఆంక్షలు ఉంటాయి. మూడంచెల భద్రతతో రెండు వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టారు. సభా స్థలికి వచ్చే వారు ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని పోలీసులు పేర్కొన్నారు. కేవలం మొబైల్స్ మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.
ఉదయం 10 గంటలకు పటాన్చెరు చేరుకోనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 10:40కి పటేల్‌గూడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. 11:20 నిమిషాలకు పటేల్ గూడలో బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో ప్రధాని మోదీ భాగమవ్వనున్నారు. పటేల్ గూడలోని SR ఇన్ఫినిటీలో ప్రధాని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
Next Story