Mon Dec 23 2024 09:36:41 GMT+0000 (Coordinated Universal Time)
ఆటోలపై కఠిన ఆంక్షలు.. ఆందోళనకు దిగిన డ్రైవర్లు
ఆటోలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆటోలపై కేసు నమోదు చేస్తున్నారు
హైదరాబాద్ లోని ఆటోలపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆటోలపై కేసు నమోదు చేయనున్నారు. నేరాలను అరికట్టే నిర్ణయాల్లో భాగంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్ణయిస్తున్నారు. హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలకు మాత్రమే నగరంలో తిరిగేందుకు అనుమతి ఉంటుందని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన ఆటోలను కూడా నగరంలో తిప్పుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా....
దీంతో కాలుష్యం ఎక్కువవుతుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వేల సంఖ్యలో ఆటోలు నగరంలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. ట్రాఫిక్ రద్దీ కూడా ఎక్కువయింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు నేటి నుంచి ఆటోలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అయితే ట్రాఫిక్ పోలీసులు తమను వేధిస్తున్నారంటూ ఆటో డ్రైవర్ లు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story