Mon Nov 25 2024 22:36:26 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad Traffic Alert : ఐకియా రోటరీ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు.. అటు వెపు వెళితే?
ఐటీ కార్యాలయాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు పోలీసులు చర్యలు ప్రారంభిస్తున్నారు
Hyderabad Traffic Alert :ఐటీ కార్యాలయాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు పోలీసులు చర్యలు ప్రారంభిస్తున్నారు. ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళ ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. ఇందులో ఐకియా రోటరీ పాయింట్ ఒకటి. ఇక్కడ ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ఇటు వైపు వచ్చే వాహనాలను అన్ని రూట్లలో మళ్లిస్తున్నామని, ఈ నెల 22వ తేదీ నుంచి కొత్త నిబంధనలను అమలులోకి వస్తాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
మార్చి 22వ తేదీ నుంచి...
సైబర్ టవర్స్కు వెళ్లేవారు ఐకియా అండర్ పాస్ నుంచి మార్చి 22వ తేదీ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లేవరు ఐకియా రోటరీ వద్ద కుడి వైపు తీసుకుని కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లాలని సూచించారు. ఇక్కడ రోటరీ వద్ద నుంచి వెళ్లేవారు యూటర్న్ తీసుకుని వెళ్లే అవకాశముందని తెలిపారు. రోటరీలోకి వచ్చిన తర్వాత కుడివైపు తీసుకోవాలని, అలాగే ఫ్రీ లెఫ్ట్ తీసుకుని కేబుల్ బ్రిడ్జి వైపు నుంచి వెళ్లాలన్నారు. బయో డైవర్సిటీ జంక్షన్ కు వెళ్లాలనుకునే పౌరులు ఐకియా అండర్పాస్ నుంచి వెళ్లాలని కోరారు. ఐకియా రోటరీ నుంచి నేరుగా వెళ్లి సీ గేట్ మొదటి యూటర్న్ ను తీసుకుని బయోడైవర్సిటీ వైపు వెళ్లాలని పోలీసులు తెలిపారు.
Next Story