Mon Dec 23 2024 15:15:57 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో వీకెండ్ ఫామ్ హౌస్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు
హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. జన్వాడ లోని రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగింది.
హైదరాబాద్ శివారులో మరో ఫామ్ హౌస్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. జన్వాడ రిజర్వ్ కాలనీలోని రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో పార్టీ జరిగింది. ఫామ్ హౌస్ పార్టీ జరుగుతున్నట్లు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఫామ్ హౌస్ పార్టీని భగ్నం చేశారు. ఇందులో కొందరు మహిళలు కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ ఫామ్ హౌస్ పార్టీలో విదేశీ మద్యం, డ్రగ్స్ ను ఒకరు వినియోగించినట్లు స్పష్టమయింది. రేవ్ పార్టీలో పాల్గొన్న వారందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించడంతో అందులో ఒకరికి మాత్రం పాజిటివ్ గా తేలినట్లు తెలిసింది.
డ్రగ్స్ పరీక్షల్లో...
ఇందులో మొత్తం 42 మంది పాల్గొన్నారని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. వీరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దొరికిన విదేశీ మద్యాన్ని ఎస్ఓటీ పోలీసులు ఎక్సైజ్ శాఖకు అప్పగింంచారు. అనేక మంది వీఐపీలున్నట్లు పోలీసులు కనుగొన్నారు. సెక్షన్ 34 యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. ఇది ఒక రాజకీయ పార్టీకి చెందిన ప్రముఖ నేతకు చెందిన బావమరిది ఫామ్ హౌస్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story