Mon Dec 23 2024 02:41:29 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ పబ్ లపై దాడులు.. డ్రగ్స్ లక్ష్యంగా
హైదరాబాద్ లోని పబ్ లలో పోలీసులు దాడులు నిర్వహించారు.
హైదరాబాద్ లోని పబ్ లలో పోలీసులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ లోని 25 పబ్ లలో నార్కోటిక్, ఎక్సైజ్ పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. పబ్ లకు వచ్చిన వారందరి నుంచి నమూనాలను సేకరించారు. డ్రగ్ డిటెక్టివ్ కిట్ లతో చాలా మంది నుంచి రక్తనమూనాలను సేకరించారు.
యాభై మందికి...
వీరిలో 50 మందికి పైగా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్ పబ్ లలో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా జరుగుతుందన్న సమాచారంతో నార్కోటిక్ పోలీసులు ఈ దాడులు జరిపారు. బెంగళూరు, ముంబయి, గోవా నుంచి డ్రగ్స్ ను తెప్పించి ఇక్కడ వినియోగిస్తున్నారని తేలింది. పోలీసులు ఒక్కసారిగా దాడులు నిర్వహించడంతో పబ్ కు హాజరయిన వారిలో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
Next Story