Fri Nov 15 2024 15:37:49 GMT+0000 (Coordinated Universal Time)
భారీ వర్షంలో విషాదం.. కరెంట్ షాక్ తో కానిస్టేబుల్ మృతి
యూసఫ్ గూడ బెటాలియన్ లో పనిచేస్తున్న తన తమ్ముడిని కలిసేందుకు వీరాస్వామి ఆదివారం సాయంత్రం యూసఫ్ గూడకు..
నాలుగు రోజులుగా భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ భారీవర్షంలో విషాద ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద కరెంట్ షాక్తో గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ మృతి చెందాడు. మృతుడు గండిపేట గ్రే హౌండ్స్ లో పనిచేస్తున్న వీరాస్వామి(45)గా గుర్తించారు. గండిపేటలో పోలీసులకు కేటాయించిన క్వార్టర్స్ లోనే కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.
యూసఫ్ గూడ బెటాలియన్ లో పనిచేస్తున్న తన తమ్ముడిని కలిసేందుకు వీరాస్వామి ఆదివారం సాయంత్రం యూసఫ్ గూడకు వెళ్లాకు. తిరిగి ఇంటికి తన బైక్ పై బయల్దేరాడు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్రీ లెఫ్ట్ వద్దకు రాగానే ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు వీరాస్వామి బైక్ అదుపుతప్పి ఫుట్ పాత్ పై పడటంతో అతను పక్కనే ఉన్న కరెంట్ స్తంభానికి తాకాడు. దాంతో వీరాస్వామికి కరెంట్ షాక్ తగిలి పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వీరాస్వామిని జూబ్లీహిల్స్ అపోలోకి తరలించగా.. అప్పటికే అతను మరణించినట్లు తెలిపారు.
Next Story