Mon Dec 23 2024 17:16:24 GMT+0000 (Coordinated Universal Time)
విధ్వంసం కేసు... 52 మంది అరెస్ట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో 52 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం వెదుకుతున్నారు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో 52 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం వెదుకుతున్నారు. ఈ కేసును కుట్ర కోణం కేసులో పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం 200 మందికి పైగా ఆర్మీ అభ్యర్థులు పాల్గొన్నారని పోలీసులు అంచనా వేస్తున్నారు. దాడులకు పాల్పడి తప్పించుకు పారిపోయిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రైల్వే పోలీసులు, టాస్క్ ఫోర్స్, నార్త్ జోన్ పోలీసుల జాయింట్ ఆపరేషరన్ లో గాలింపు కొనసాగుతుంది.
గుర్తించే పనిలో...
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో వేల సంఖ్యలో ఆర్మీ అభ్యర్తులు పాల్గొన్నారు. వారిలో రెండు వందల మంది దాడులకు పాల్పడినట్లు గుర్తించారు. వీరందరినీ గుర్తించడం చాలా కష్టంగా మారింది. సీసీ టీవీ కెమెరాలు కొన్ని ధ్వంసం చేశారు. కొన్నింటిలో వారిని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరిని మీడియాలో వచ్చిన వీడియో క్లిప్పింగ్ ల ద్వారా వారిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.
Next Story