Mon Dec 23 2024 10:10:29 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ మెట్రో స్టేషన్ లిఫ్ట్ లో మహిళ ముందు యువకుడి పాడు పని
అమీర్‌పేట మెట్రో స్టేషన్లో లిఫ్ట్‌లో మహిళ ముందు హస్తప్రయోగం చేస్తున్న 18 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అమీర్‌పేట మెట్రో స్టేషన్లో లిఫ్ట్‌లో మహిళ ముందు హస్తప్రయోగం చేస్తున్న 18 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళా ప్రయాణికురాలు లిఫ్ట్‌లో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమెను వెంబడిస్తున్న యువకుడు.. ఆమెతో పాటు లిఫ్ట్‌లోకి ప్రవేశించి పాడు పని చేయడం ప్రారంభించాడు. దీంతో భయపడిన మహిళ వెంటనే బయటకు వచ్చి భద్రతా సిబ్బందికి సమాచారం అందించింది. వెంటనే భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అతడిని ఒడిశాకు చెందిన 18 ఏళ్ల రాజుగా గుర్తించారు.
సెక్యూరిటీ సిబ్బంది అతడిని ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతనిపై CP చట్టంలోని సెక్షన్ 70C (ఏదైనా బెదిరింపు, అవమానకరమైన లేదా అసభ్యకరమైన పదాలు లేదా సంజ్ఞలను చేయడం) కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన రాజు ఆమెను లిఫ్ట్‌లోకి వెంబడించాడని.. తన మొబైల్ ఫోన్లో వీడియో చూస్తూ, బట్టలు విప్పి హస్తప్రయోగం చేయడం ప్రారంభించాడని తెలిపారు. ఖైరతాబాదుకు చెందిన ఆ యువతి మంగళవారం అమీర్ పేటలో షాపింగ్ ముగించుకుని తిరిగి ఖైరతాబాద్ వెళ్లేందుకు అమీర్ పేట్ మెట్రోస్టేషన్ లిప్ట్ ఎక్కింది. రాజు మెట్రో స్టేషన్ లిఫ్ట్ వద్దే ఉంటూ ఒంటరిగా వెళ్లే మహిళలతో ఇదే తీరుగా ప్రవర్తిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. సోమవారం నగరానికి వచ్చిన అతను ఉదయం నుంచి లిఫ్ట్‌లో ఇలాగే ప్రవర్తిస్తున్నట్లు విచారణలో తేలింది. పోలీసులు రాజును అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
Next Story