Mon Dec 23 2024 11:57:16 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ వాసులకు అలర్ట్
మూడు నెలల పాటు హైదరాబాద్లోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.
మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అక్కడ నాలా పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు మూడు నెలల పాటు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఎర్రగడ్డ పోలీసులు ట్రాఫిక్ మళ్లింపును చేపట్టారు. ఈ రోజు నుంచి జులై 28వ తేదీ వరకూ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.
90 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు...
ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు 90 రోజుల పాటు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు మెట్రో స్టేషన్ వద్ద ఉన్న ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకూ నాలా పునరుద్దరణ పనులను జీహెచ్ఎంసీ చేపట్టింది. వర్షాలకు ముందే ఈ కార్యక్రమాలు చేపట్టవలసి ఉన్నందున త్వరితగతిన పనులు పూర్తయ్యేందుకు ప్రజల సహకారం కూడా అవసరమని అధికారులు కోరుతున్నారు. ఇక్కడ దారిని మళ్లిస్తున్నామని వాహనదారులు గమనించాలని కోరుతున్నారు.
Next Story