Mon Dec 23 2024 11:15:01 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : రేపు అటు వైపు రావద్దు.. వచ్చారంటే ఇరుక్కుపోయినట్లే
రేపు హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి
రేపు హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. పబ్లిక్ గార్డెన్స్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్లించనున్నారు. ఎస్బీఐ గన్ ఫౌండ్రి నుంచి వచ్చే వాహనాలను చాపెల్ రోడ్డు వైపు మళ్లించనున్నారు.
దారి మళ్లింపు...
బషీర్బాగ్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలు కింగ్ కోఠి వైపు మరలించనున్నారు. సుజాత స్కూల్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్లించనున్నారు. ప్రజలు రేపు ఈ ప్రాంతానికి వచ్చే వారు ప్రత్యామ్నాయం ఎంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. రేపు తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ తో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ నేతలు హాజరవుతుండటంతో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.
Next Story