Mon Dec 23 2024 10:24:54 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : నేడు హైదరాబాద్లో రాత్రి 12 వరకూ ట్రాఫిక్ ఆంక్షలు.. అటుగా వెళ్లారంటే?
నేడు హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ప్రత్యామ్నాయ మార్గాల నుంచి వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు
నేడు హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ప్రత్యామ్నాయ మార్గాల నుంచి వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. శ్రీరాముడి శోభాయాత్ర జరుగుతున్నందున కొన్ని యాత్ర కొనసాగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. సీతారాంబాగ్ నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది.
శోభాయాత్ర ...
సీతారాంబాగ్ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర బోయగూడ కమాన్, మంగళహాట్, దూల్పేట్, పురానాపూల్, బేగంబజార్, గౌలిగూడ, కోఠి మీదుగా హనుమాన్ వ్యాయమశాలకు చేరుకోనుంది. పోలీసులు సూచించిన మార్గంలోనే శోభాయాత్ర వెళ్లేలా నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అములులో ఉండనున్నాయి.
Next Story