Mon Dec 23 2024 03:25:53 GMT+0000 (Coordinated Universal Time)
Where is HarshaSai: హర్ష సాయి ఎక్కడ.. లొంగిపోతాడా? పారిపోయాడా?
హర్ష సాయి తనపై అత్యాచారం చేశాడని, ఆపై తన నగ్న చిత్రాలను సేకరించి
ఓ నటిపై అత్యాచారం, బ్లాక్మెయిల్కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్ష సాయి కోసం నార్సింగి పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) జారీ చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో సెప్టెంబర్ 24 నుంచి పోలీసులు హర్ష సాయి కోసం వెతుకుతున్నారు. హర్ష సాయి విదేశాలకు పారిపోయి ఉండవచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి.
హర్ష సాయి తనపై అత్యాచారం చేశాడని, ఆపై తన నగ్న చిత్రాలను సేకరించి బ్లాక్ మెయిల్ చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఎంతో మందికి సహాయం చేస్తున్న వీడియోలతో హర్ష సాయి పాపులర్ అయ్యారు. విశాఖపట్నంకు చెందిన అతడిని 'మిస్టర్ బీస్ట్ ఆఫ్ ఇండియా' అని కూడా పిలుస్తారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు 25 ఏళ్ల బాధితురాలిని 2023లో సినిమా ప్రాజెక్ట్ కోసం కలిశాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని, అయితే చివరికి ఆమెను మోసం చేశాడని పోలీసులు తెలిపారు. ఈ పరిణామాల మధ్య యూట్యూబర్ హర్షసాయిపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.
Next Story