Sun Dec 22 2024 15:00:07 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన ఖరారయింది.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన ఖరారయింది. ఈ పర్యటన ఈ నెల 28వ తేదీన ఉండనుంది. ఒకరోజు పర్యటన నిమిత్తం రాష్ట్రపతి హైదరాబాద్ కు వస్తుండటంతో అందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్రపతి పర్యటనపై అధికారులతో సమీక్షించారు.
ఈనెల 28వ తేదీన...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టంబరు 28వ తేదీ ఉదయం నల్సార్ యూనివర్సిటీని సందర్శిస్తారు. అక్కడ జరిగే యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరు కానున్నారు. దీంతో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన శాంతికుమారి శాఖల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రపతి కార్యాలయ అవసరాలకు అనుగుణంగా అన్ని చర్యలను తీసుకోవాలని ఈ సమావేశంలో ఆమె అధికారులను ఆదేశించారు.
Next Story