Mon Dec 23 2024 07:14:28 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : హైదరాబాద్లో మోదీ రోడ్ షో.. మూడు కిలోమీటర్ల మేరకు
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. మూడు కిలోమీటర్ల రోడ్ షోలో ప్రధాని పాల్గొన్నారు
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. మూడు కిలోమీటర్ల రోడ్ షోలో ప్రధాని పాల్గొన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడలోని వీర సావర్కర్ విగ్రహం వరకూ రోడ్ షో నిర్వహించారు. దారి పొడువునా ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ కనిపించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నారాయణగూడ, వైఎంసీఏ చౌరస్తా, కాచిగూడ క్రాస్ రోడ్స్ వరకూ మోదీ రోడ్ షో కొనసాగుతుంది. మోదీని చూసేందుకు దారిపొడువునా పెద్దయెత్తున ప్రజలు హాజరయ్యారు. మోదీ రోడ్ షో సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కేంద్ర బలగాలతో అత్యంత భద్రత నడుమ మధ్య మోదీ రోడ్ షో సాగింది.
దారి పొడువునా...
దారిపొడువునా ప్రజలు మోదీపై పూలవర్షం కురిపించారు. పార్టీ అభిమానులు, కార్యకర్తలు వేలసంఖ్యలో హాజరై రోడ్డుకు ఇరువైపులా నిల్చుని మోదీని ప్రత్యక్షంగా చూసేందుకు ప్రయత్నించారు. డప్పులు, మంగళవాయిద్యాల మధ్య ప్రధాని రోడ్ షో మూడు కిలోమీటర్ల మేర సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారం నిమిత్తం మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. వివిధ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మధ్యలో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని వచ్చిన మోదీ ఈరోజు రోడ్ షో అనంతరం తిరిగి రాత్రికి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. రేపటితో తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో మూడు రోజుల మోదీ ప్రచారం ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందన్నది చూడాలి.
Next Story