Wed Nov 06 2024 01:27:09 GMT+0000 (Coordinated Universal Time)
ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడి ఎత్తు ఎంతంటే?
ఖైరతాబాద్ గణేశ్ తయారీకి పూజలు ప్రారంభమయ్యాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కమిటీ ప్రారంభించింది
ఖైరతాబాద్ గణేశ్ తయారీకి పూజలు ప్రారంభమయ్యాయి. వినాయక చవితికి ఖైరతాబాద్ లో గణేశ్ ను ప్రతిష్టించడం దశాబ్దాలుగా వస్తున్న ఆచారం కావడంతో దీనికి అంత ప్రాముఖ్యత ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతారు. దీనికి సంబంధించి నిన్న కళాపూజ కార్యక్రమం జరిగింది.
సెప్టంబరు 7న...
ఈ ఏడాది సెప్టంబరు 7వ తేదీన వినాయక చవితి కావడంతో ఈలోపు విగ్రహం తయారీకి అవసరమైన ఏర్పాట్లను ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రారంభించింది. నిన్న కర్ర పూజ నిర్వహించింది. ఈ ఏడాది ఖైరతాబాద్ విగ్రహాన్ని 70 అడుగులుగా ఉండాలని కమిటీ నిర్ణయించింది. మొత్తం పదకొండు రోజుల పాటు ఖైరతాబాద్ గణేశుడికి పూజలు నిర్వహించి తర్వాత హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయనున్నారు.
Next Story