Thu Dec 26 2024 00:25:29 GMT+0000 (Coordinated Universal Time)
రేపు సీఎంతో టాలీవుడ్ పెద్దల భేటీ
సంథ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ కుటుంబానికి పుష్ప టీం భారీ పరిహారాన్ని ప్రకటించింది.
సంథ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ కుటుంబానికి పుష్ప టీం భారీ పరిహారాన్ని ప్రకటించింది. శ్రీతేజ్ కుటుంబానికి రెండు కోట్ల రూపాయల చెక్కును అల్లు అరవింద్ అందించారు. అందులో అల్లు అర్జున్ కోటి రపాయలు, పుష్ప నిర్మాతలు యాభై లక్షలు, దర్శకుడు సుకుమార్ యాభై లక్షలు కలిపి ఈ పరిహారాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ త్వరగా శ్రీతేజ్ కోలుకుని తిరిగి మామూలుగా తిరగాలని ఆకాంక్షించారు.
శ్రీతేజ్ కుటుంబానికి రెండు కోట్లు...
సంథ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట దురదృష్టకరమని ఆయన అన్నారు. ఆ కటుంబాన్ని ఆదుకునేందుకు తాము నిరంతరం అందుబాటులోనే ఉంటామని చెప్పారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రేపు టాలీవుడ్ పెద్దలందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story