Sat Dec 28 2024 05:29:58 GMT+0000 (Coordinated Universal Time)
ఉస్మాన్ సాగర్లో 8 అడుగుల కొండచిలువ డేరింగ్ రెస్క్యూ ఆపరేషన్
హైదరాబాద్ శివారులోని ఉస్మాన్ సాగర్ లో కొండచిలువ కలకలం రేపింది. అయితే సురక్షితంగా బయటకు తీయగలిగారు
హైదరాబాద్ శివారులోని ఉస్మాన్ సాగర్ లో కొండచిలువ కలకలం రేపింది. ఉస్మాన్ సాగర్ డ్యామ్ వద్ద క్రస్ట్ గేట్ సమీపంలో ఈ కొండచిలువను గుర్తించారు. ఈ కొండచిలువ ఎనిమిది అడుగుల వరకూ ఉంది. దీని బరువు ఇరవై కిలోలుగా ఉంది. అయితే ఈ కొండచిలువను కాపాడారు. సిటీ బెస్ట్ స్నేక్స్ రెస్యూ ఆర్గనైజేషన్ అయిన ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసొటీ ఈ కొండచిలువలను సురక్షితంగా ఉస్మాన్ సాగర్ నుంచి బయటకు తీసుకు వచ్చారు. కొండ చిలువను క్రస్ట్ గేట్ వద్ద చిక్కుకుపోయి ఉండటంతో దీనిని తీయడం ఎఫ్ఓఎస్ సభ్యుడు వరప్రసాద్ కు కొంత కష్టమయింది. అయితే శ్రమించి ఈ కొండ చిలువను బయటకు తీశారు.
సురక్షితంగా బయటకు తీసి...
అత్యంత ప్రమాదకరమైన ఈ ఆపరేషన్ ను చివరకు విజయవంతంగా ముగించారు. కొండచిలువను బయటకు తీయడం చాలా కష్టంతో కూడిన పని అని ఎఫ్ఓఎస్ సభ్యుడు వరప్రసాద్ తెలిపారు. ఇరవై కిలోల బరువున్న దానిని బయటకు తీయాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఒకదశలో కొండ చిలువ బయటకు తీస్తున్నప్పుడు వరప్రసాద్ చేతికి చిక్కుకుకోవడంతో కొంత టెన్షన్ మొదలయింది. అయితే వరప్రసాద్ తోపాటు కొండ చిలువను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. బయటకు తీసుకు వచ్చిన కొండ చిలువను నెహ్రూ జూలాజికల్ పార్కుకు అప్పగించారు. దీంతో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులను అందరూ అభినందిస్తున్నారు.
Next Story