Wed Dec 25 2024 21:48:12 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్లో రెండో రోజు రాహుల్
హైదరాబాద్ లో రెండో రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర కొనసాగుతుంది
హైదరాబాద్ లో రెండో రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం కూకట్పల్లిలో రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది. కూకట్ పల్లిలో ఒక కేఫ్ లో ఆగి రాహుల్ గాంధీ టీ తాగారు. భారీగా ప్రీజలు రాహుల్ పాదయాత్రకు స్పందన లభిస్తుంది. వేలాది మంది రాహుల్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై తమ మద్దతు పలికారు. బాలానగర్ నుంచి పాదయాత్ర తొలుత ప్రారంభమయింది.
యాత్ర జోరుగా...
రాహుల్ గాంధీ వెంట ఉత్సాహంగా నడుస్తూ కార్యకర్తలు నడుస్తుండటంతో యాత్ర జోరుగా సాగుతుంది. రాహుల్ రాత్రికి ముత్తంగి వద్ద బస చేయనున్నారు. రాహుల్ వెంట కాంగ్రెస్ అగ్రనేతలు కూడా పాదయాత్ర చేస్తున్నారు. రాహుల్ పాదయాత్ర సందర్భంగా ట్రాఫిక్ ను పోలీసులు క్రమబద్దీకరించారు. ప్రత్యామ్యాయ మార్గాల వైపు వెళ్లాలని పోలీసులు సూచించారు. రాహుల్ పాదయాత్రకు విశేష స్పందన రావడంతో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తుంది. రాత్రికి ముత్తంగి వద్ద కార్నర్ మీటింగ్ ఉంటుంది
Next Story