Sun Mar 02 2025 22:19:24 GMT+0000 (Coordinated Universal Time)
Hyderababd : ఇక్కడ స్థలం కొనాలంటే గజానికి లక్షలు పెట్టాల్సిందే.. అతి ఖరీదైన ప్రాంతాలివే
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం మరింత ఊపందుకుంది. స్థలాల ధరలకు రెక్కలు వచ్చాయి.

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం మరింత ఊపందుకుంది. స్థలాల ధరలకు రెక్కలు వచ్చాయి. నిన్న మొన్నటి వరకూ ధరలు అటు ఇటుగా ఉన్నప్పటికీ మళ్లీ రియల్ బూమ్ ఊపందుకుంది. రియల్ ఎస్టేట్ రంగం పెరగడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. హైదరాద్ నగరం వేగంగా విస్తరిస్తుండటంతో పాటు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి. ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో పాటు మెట్రో రైలు విస్తరణ వంటి పనులతో భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కొనాలంటే గజానికి లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ముఖ్యంగా అతి ఖరీదైన ప్రాంతాలుగా జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, కూకట్ పల్లి, మణికొండ తదితర ప్రాంతాలు ఉన్నాయి.
కొంతకాలంగా...
గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ రంగంలో నిస్తేజం నెలకొందని అందరూ భావించారు. తెలంగాణలో ప్రభుత్వం మారడంతో ప్రాధాన్యతలు ఏమయి ఉంటాయన్నదానిపై కొంత కొనుగోలుదారులు వెనక్కు తగ్గారు. స్థలాలు మాత్రమే కాదు.. అపార్ట్ మెంట్ల కొనుగోళ్లు కూడా నిలిచిపోయాయి. భూముల క్రయ విక్రయాలు నిలిచపోవడంతో ప్రభుత్వానికి రిజస్ట్రేషన్ ద్వారా లభ్యమయ్యే ఆదాయంకూడా తగ్గిందన్న గణాంకాలు బయటకు వచ్చాయి. అయితే మళ్లీ రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. తిరిగి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. క్రయవిక్రయాలు జోరుగా సాగుతుండటంతో రియల్టర్లు కూడా హ్యాపీ ఫీలవుతున్నారు. ఇక హైడ్రా వంటి సంస్థల దూకుడుతో ఆచితూచి కొంత కొనుగోలు చేసిన వారు అన్నీ సరిచూసుకుని కొంటున్నారు.
వేలం పాటలో...
తాజాగా హౌసింగ్ బోర్డు నార్త్ డివిజన్ లో జరిగిన స్థలాల వేలంపాటలో గజం ధర ఒక్కసారిగా పెరిగింది. మొత్తం ఏడు స్థలాలకు గాను మూడు అమ్ముడుపోయాయని అధికారులు తెలపిారు. గచ్చిబౌలిలో గజం స్థలం ధర 1.90 లక్షల వరకూ పలికింది. ఇక్కడ 81.45 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. కూకట్ పల్లిలోని బాలాజీ నగరం్ లో గజం ధర 1.85 లక్షల రూపాయలకు వేలం పాటలో సొంతం చేసుకున్నారు. కూకట్ పల్లలిలో 87.98 గజాల స్థలం అమ్ముడు పోయింది. ఇదే కాలనీకి చెందిన 92.36 వాణిజ్యస్థలాన్ని లక్ష డెబ్భయి అయిదు వేల రూపాయలకు వేలంలో దక్కించుకున్నారు. క్రమంగా ధరలు అమాంతం పెరగడంతో రియల్ రంగానికి రెక్కలు వచ్చినట్లయింది.
Next Story