Mon Dec 23 2024 09:38:49 GMT+0000 (Coordinated Universal Time)
తొలిరోజు 5.5 కోట్ల చెల్లింపులు
తెలంగాణలో పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కు స్పందన బాగా కన్పిస్తుంది.
హైదరాబాద్ : తెలంగాణలో పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కు స్పందన బాగా కన్పిస్తుంది. ట్రాఫిక్ పోలీసులు వేసిన చలాన్లకు రాయితీలు ప్రకటించడంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి చలాన్లను కడుతున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కార్యక్రమం ఉంటుంది. తొలిరోజున ట్రాఫిక్ చలాన్ల రూపంలో ఐదు లక్షల రూపాయల వరకూ క్లియర్ అయిపోయాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. దీంతో తొలిరోజు 5.5 కోట్ల రూపాయల నగదు జమ అయింది.
సర్వర్ డౌన్....
హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో దాదాపు 600 కోట్ల పెండింగ్ చలాన్లు ఉన్నాయి. అయితే ద్విచక్ర వాహనాలకు 75 శాతం, కార్లు, హెవీ వెహికల్స్ కు 50 శాతం రాయితీలను ప్రకటించడంతో పెద్దయెత్తున చలాన్లను చెల్లించేందుకు ముందుకు వచ్చారు. ఎక్కువ మంది చెల్లించడానికి ముందుకు రావడంతో ఈ చలాన్ వెబ్ సైట్ సర్వర్ కూడా డౌన్ అయింది.
Next Story