Tue Nov 19 2024 08:42:59 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ప్రతిష్టాత్మక టీ హబ్ ప్రారంభం
హైదరాబద్ లో అతి పెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ టీ హబ్ రెండో దశ నేడు ప్రారంభం కానుంది
హైదరాబద్ లో అతి పెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ టీ హబ్ రెండో దశ నేడు ప్రారంభం కానుంది. గచ్చిబౌలిలో ప్రభుత్వం నిర్మించిన ఈ భవనాన్ని నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. 400 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మించారు. మొత్తం 3.62 లక్షల చదరపు అడుగులు ఉంటుంది. రెండో దశలో నిర్మించిన టీ హబ్ లో దాదాపు రెండు వేల స్టార్టప్ కంపెనీలు కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు.
అవగాహన ఒప్పందాలు...
ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ టీహబ్ ను ప్రారంభించనున్నారు. ఈరోజు అనేక కంపెనీలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోనుంది. కూయాప్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, హీరోమోటార్స్, పొంటాక్ తదితర సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకోనుందని రాష్ట్ర ఐటీ శాఖ అధికారులు చెప్పారు.
Next Story