Mon Dec 23 2024 12:35:28 GMT+0000 (Coordinated Universal Time)
హెచ్సీఏ వద్ద టెన్షన్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులను ఉప్పల్ స్టేడియంలోకి రానివ్వకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులను ఉప్పల్ స్టేడియంలోకి రానివ్వకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. గేట్లను మూసివేసి లోపలికి అనుమతించడం లేదు. ఈరోజు ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేకంగా సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో సభ్యులు అక్కడకు చేరుకున్నారు.
సభ్యులను అడ్డుకున్న సెక్యురిటీ...
అయితే అజారుద్దీన్ సూచనల మేరకు సెక్యూరిటీ సిబ్బంది స్టేడియంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. సెక్యురిటీ సిబ్బందితో హెచ్సీఏ సభ్యులు వాగ్వాదానికి దిగారు. గేటు బయటే ఉన్న సభ్యులు ఆందోళనకు దిగారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని కోరుతున్నారు.
Next Story