Sun Dec 22 2024 11:48:00 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : సరోజినిదేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు.. దీపావళి టపాసులు పేలుస్తుండగా
దీపావళి రోజు టపాసులు కాలుస్తుండగా ప్రమాదాలు జరిగి అనేక మంది ఇప్పటికే సరోజిని కంటి ఆసుపత్రికి వద్దకు చేరారు
హైదరాబాద్ సరోజినిదేవి కంటి ఆసుపత్రికి బాధితులు క్యూ కట్టారు. దీపావళి రోజు టపాసులు కాలుస్తుండగా ప్రమాదాలు జరిగి అనేక మంది ఇప్పటికే సరోజిని కంటి ఆసుపత్రికి వద్దకు చేరారు. హైదరాబాద్ నగరంలో దాదాపు వంద మందికి పైగా బాధితులు సరోజిని దేవి కంటి ఆసుపత్రికి వచ్చినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఇక్కడకు వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు.
టపాసులు కాలుస్తుండగా...
రాత్రి పొద్దుపోయే వరకూ దాదాపు 70 మంది వరకూ సరోజిని దేవి ఆసుపత్రికి వచ్చారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కొందరు కంటి సమస్యలతో ఇబ్బందులతో పడి ఆసుపత్రులకు వస్తున్నారు. మరికొందరు చేతులు, కాళ్లు కాలిపోయి వివిధ ఆసుపత్రులకు చేరుతున్నారు. దీపావళి పండగ రోజు అజాగ్రత్తగా ఉండటం వల్లనే ఇంత పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. సరైన జాగ్రత్తలు పాటించాలని పదే పదే చెబుతున్నప్పటికీ పెడచెవిన పెట్టడంతో కంటి సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆసుపత్రికి చేరుతున్నారు.
Next Story