Thu Nov 21 2024 23:20:44 GMT+0000 (Coordinated Universal Time)
శంషాబాద్ ఎయిర్ పోర్ట్.. మహిళల హ్యాండ్ బ్యాగుల్లో ఏమి దాచారంటే?
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఐదు కిలోల కొకైన్ ను డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రయాణికుడు లావోస్ నుండి హైదరాబాదు మీదుగా సింగపూర్ వెళ్తున్నాడు. ఈ సమయంలో ఆ ప్రయాణికుడు డ్రగ్స్ ను ఎయిర్ పోర్టు దాటించే ప్రయత్నం చేశాడు. డ్రగ్స్ ని సూట్ కేస్ అడుగుభాగంలో పెట్టి తరలించే ప్రయత్నం చేశాడు. చెకింగ్ లో డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. డిఆర్ఐ అధికారులు వెంటనే ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి ఐదు కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో 50 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు. ప్రయాణికుడిని అరెస్టు చేసి విచారణ కొనసాగించారు.
లావోస్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ వ్యక్తి మహిళల హ్యాండ్ బ్యాగ్ కింది భాగంలో కొకైన్ దాచాడు. డీఆర్ఐ అధికారులు అనుమానం వచ్చి అతన్ని తనిఖీ చేయగా ఐదు కిలోల కొకైన్ బయటపడింది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పక్కా సమాచారం రావడంతో ప్రయాణికులపై నిఘా పెట్టారు అధికారులు. దీంతో డ్రగ్స్ తీసుకు వెళ్తున్న వ్యక్తిని గుర్తించి తనిఖీ చేశారు. నిందితుడి దగ్గర భారీ స్థాయిలో డ్రగ్స్‌ను అధికారులు గుర్తించారు. అనంతరం నిందితుడి దగ్గర ఉన్న రూ.50 కోట్ల విలువైన 5 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రయాణికుడిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం జ్యుడీషియల్ రిమాండ్‌కు డీఆర్ఐ అధికారులు తరలించారు.
Next Story