Tue Nov 19 2024 20:41:35 GMT+0000 (Coordinated Universal Time)
రాములోరి శోభాయాత్రకు అంతా సిద్ధం
శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర ప్రారంభం కానుంది
శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర ప్రారంభం కానుంది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా శోభాయాత్రకు అనుమతి లేదు. రెండేళ్ల అనంతరం పోలీసులు అనుమతివ్వడంతో లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశముంది. సీతారాంబాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల శరకూ ఈ శోభాయాత్ర ప్ర్రారంభం కానుంది. అలాగే గంగాబౌలి ఆకాశ్ పురి హనుమాన్ ఆలయం నుంచి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నేతృత్వంలో శోభాయాత్ర ప్రారంభమవుతుంది.
వదంతులు నమ్మొద్దు.....
శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదు వేల మంది పోలీసులను నియమించారు. ఎటువంటి వదంతులు నమ్మవద్దని, అనుమతించిన రూట్లోనే శోభాయాత్ర వెళ్లేలా నిర్వాహకులు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో ప్రత్యేకంగా నిఘాను ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ను కూడా ఏర్పాటు చేశారు.
Next Story