Wed Nov 27 2024 10:43:12 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : ఈ రోడ్డుపై గుంట ఉన్నది జాగ్రత్త...ఎప్పుడు పూర్తి చేస్తారు సామీ?
హైదరాబాద్లోని మియాపూర్లోని దీప్తిశ్రీనగర్లో రోడ్డులో పెద్ద గుంత ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారింది
హైదరాబాద్లోని మియాపూర్లోని దీప్తిశ్రీనగర్లో రోడ్డులో పెద్ద గుంత ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీని మరమ్మతులు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ఈనెల 13వ తేదీన ఈ గుంట ఏర్పడితే ఇప్పటి వరకూ జీహెచ్ఎంసీ అధికారులు కానీ, తాగునీటి సరఫరా శాఖ అధికారులు కానీ దీనిని పూడ్చలేకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతం నుంచే వినాయకుడి విగ్రహాలు నిమజ్జనానికి వెళ్లాల్సి ఉన్నప్పటికీ అధికారులు గుంట పూడ్చే చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తొలుత చిన్న గుంట ఏర్పడి దీనికి డ్రైనేజీ వాటర్ తోడయి ఇప్పుడు అతి పెద్దదిగా మారింది.
మురుగు నీటితో...
మురుగు నీరు బయటకు రావడంతో దుర్వాసన వెలువడుతోంది. శనివారం మొదలుపెట్టినా ఇంకా అవి కొలిక్కి రాలేదు. దీంతో వాహనాలను ఈ దారిలో పంపించకుండా పోలీసులు బ్యారికేడ్లను నిర్మించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచిస్తున్నారు. దాదాపు ఐదువందల కుటుంబాలు ఈ రహదారి నుంచే మెయిన్ రోడ్డుకు చేరుకోవాల్సి ఉండగా ఈ మురికి నీటి గుంతతో ఇబ్బందిగా మారిందని స్థానికులు వాపోతున్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని చెబుతున్నారు. డ్రైనేజీ పైపులైను పగిలి క్రమంగా అది పెద్దదిగా మారి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. స్థానికులు అయితే వెంటనే దీనిని మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
Next Story