Fri Nov 22 2024 09:39:17 GMT+0000 (Coordinated Universal Time)
పప్పులో పాము
కుషాయిగూడలోని ఈసీఐఎల్ కంపెనీలో కలకలం రేగింది. అక్కడి క్యాంటీన్లో మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో
కుషాయిగూడలోని ఈసీఐఎల్ కంపెనీలో కలకలం రేగింది. అక్కడి క్యాంటీన్లో మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో.. ఒక ప్లేటులో అన్నం వడ్డిస్తున్నప్పుడు, పప్పులో పాము వచ్చింది. అది చూసిన ఉద్యోగులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అన్నం తిందామని అనుకున్న ప్రతి ఒక్కరూ ఏమి చేయలేక పక్కన పెట్టేయాల్సి వచ్చింది.
ఈసీఐఎల్ సెంట్రల్ క్యాంటీన్లో వండిన ఆహారాన్ని చర్లపల్లిలోని ఈవీఎం సంస్థకి పంపించారు. శుక్రవారం మధ్యాహ్నం ఉద్యోగులకు ఆహారం అందించారు. అప్పటికే కొందరు భోజనాలు చేయగా.. ఇంకొందరు తింటూ ఉన్నారు. ఆ సమయంలో పప్పులో నుండి పాము పిల్ల బయటపడింది. అది చూసిన ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు ప్రయత్నించినప్పటికీ.. అప్పటికే కొందరు పాము ఫోటోలు తీయడం.. వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేయడం జరిగిపోయింది. అప్పటికే తినేసి కొందరు ఉద్యోగులు మీడియాకు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్యాంటీన్లో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఆహార పదార్థాల్లో ఎలుకలు, బీడీలు, సిగరెట్టు, జిల్ల పురుగులు వచ్చినట్టు ఉద్యోగులు తెలిపారు. ఏమాత్రం నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారని.. నిర్లక్ష్యం వహించిన వారిని వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా ఉద్యోగులు డిమాండ్ చేశారు.
Next Story