Mon Dec 23 2024 10:49:22 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : సాఫ్ట్వేర్ కంపెనీ మోసం.. పది కోట్లకు టోకరా
హైదరాబాద్ లో మరో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఫ్రైడే ఆప్ కన్సెల్టెన్సీ కంపెనీ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి యాజమాన్యం పరారయింది.
హైదరాబాద్ లో మరో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఫ్రైడే ఆప్ కన్సెల్టెన్సీ కంపెనీ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి యాజమాన్యం పరారయింది. సుమారు రెండు వందల మంది నిరుద్యోగుల నుంచి పది కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయింది. ప్రతి అభ్యర్థి 1.50 లక్షలు ఇస్తే శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికింది. దీంతో రెండు వందల మంది నిరుద్యోగులు కంపెనీని నమ్మి డబ్బులు కట్టారు. అయితే శిక్షణ తర్వాత ప్లేస్ మెంట్ ఇప్పించినట్లు మోసం చేసింది.
తాళాలు వేసి ఉండటంతో...
జీతాలు ఇవ్వకపోవడంతో అభ్యర్థులకు అనుమానం కలిగింది. దీంతో పాటు సాఫ్ట్వేర్ కంపెనీకి తాళాలు వేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు మాదాపూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయ్యప్ప సొసైటీలో ఉన్న ఈ సాఫ్ట్వేర్ కంపెనీ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కంపెనీకి హైదరాబాద్ తో పాటు బెంగళూరు, విజయవాడలోనూ ఇటువంటి సెంటర్లను తెరిచిందని బాధితులు చెబుతున్నారు.
Next Story