Fri Jan 10 2025 15:24:10 GMT+0000 (Coordinated Universal Time)
Sankranthi : సంక్రాంతికి విశాఖ వెళ్లే వారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి వెళ్లే రైళ్లు ఇవే
సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే విశాఖపట్నం వాసులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.
సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే విశాఖపట్నం వాసులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సురక్షితమైన, తక్కువ ఖర్చుతో తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు వీలుగా ఈ రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారుల వెల్లడించారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు బయలుదేరనున్నట్లు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి - విశాఖపట్నం మధ్య జనసాధారణ్ అన్రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లను నడుపుతుంది.
ఆ రైళ్లు వివరాలు ఇవే...
1) రైలు నంబర్: 08534 చర్లపల్లి - విశాఖపట్నం (జనసాధారణ్ అన్రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లు) జనవరి 11, 13, 16 మరియు 18, 2025 తేదీలలో చర్లపల్లి నుండి ఉదయం 00.30 గంటలకు (రాత్రి 12.30 గంటలకు) బయలుదేరి మధ్యాహ్నం 2.20 గంటలకు (అదే రోజున ) విశాఖపట్నం చేరుకుంటుంది.
2) రైలు నంబర్: 08533 విశాఖపట్నం - చర్లపల్లి (జనసాధారణ్ అన్రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లు)
విశాఖపట్నం నుండి జనవరి 10, 12, 15 మరియు 17, 2025 తేదీలలో ఉదయం 09.45 గంటలకు బయలుదేరి (అదే రోజు) రాత్రి 22.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు: 08533 / 08534 విశాఖపట్నం - చర్లపల్లి - విశాఖపట్నం జనసాధరణ (అన్ రిజర్వ్డ్) ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్ లలో ఇరువైపులా ఆగుతాయి
3) రైలు నెం. 08538 చర్లపల్లి - విశాఖపట్నం (జనసాధరణ అన్రిజర్వ్డ్ ప్రత్యేక రైళ్లు) జనవరి 11, 12, 16 & 17వ తేదీల్లో చర్లపల్లిలో ఉదయం 10.00 గంటలకు బయలుదేరి 22.00 గంటలకు (అదే రోజు రాత్రి) విశాఖపట్నం చేరుకుంటుంది.
4) రైలు నెం. 08537 విశాఖపట్నం - చర్లపల్లి (జనసాధరణ అన్రిజర్వ్డ్ ప్రత్యేక రైళ్లు) 2025 జనవరి 10, 11, 15 & 16 తేదీలలో విశాఖపట్నం నుండి (సాయంత్రం 6.20) 18.20 గంటలకు బయలుదేరుతుంది మరియు 08.00 గంటలకు (మరుసటి రోజు ఉదయం) చర్లపల్లి చేరుకుంటుంది.
రైలు నం. 08537/08538 విశాఖపట్నం - చర్లపల్లి - విశాఖపట్నం జనసాధారణ (అన్ రిజర్వ్డ్) ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యల లమంచలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు , విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్ లలో ఇరువైపులా ఆగుతాయి. ఈ జనసాధరన్ ప్రత్యేక రైళ్లన్నీ జనరల్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికులను సులభతరం చేయడానికి అన్రిజర్వ్డ్ కోచ్‌లను కలిగి ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.
Next Story