Sun Dec 22 2024 16:22:00 GMT+0000 (Coordinated Universal Time)
Summer special trains : కృపయా ధ్యాన్ దే .. వేసవి రైళ్లు పట్టాలపైకి వస్తున్నాయ్
వేసవిలో ప్రయాణికుల సౌకర్యార్ధం కోసం దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది
సమ్మర్ లో చాలా మంది పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు వెళుతుంటారు. పిల్లలకు వేసవి సెలవులు ఉండటంతో పాటు వేసవి కాలంలో అయితే ఇబ్బంది లేకుండా ప్రయాణాలు చేయవచ్చని, పర్యాటక ప్రదేశాలు చూడవచ్చని భావిస్తారు. మరికొందరు తమ సొంతూళ్లకు వెళ్లి అక్కడ గడిపేందుకు ఇష్టపడతారు. ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా చుట్టి వస్తారు. తమ కుటుంబ సభ్యులతో కలసి సుఖవంతమైన ప్రయాణం చేయాలంటే రైలు ప్రయాణమే బెటర్ అన్నది వేరే చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే తక్కువ మొత్తంలో సుఖవంతమైన ప్రయాణాన్ని ఒక రైలులోనే సాధ్యమవుతుంది.
రద్దీ ఎక్కువగా ఉండటంతో...
అందుకే వేసవి కాలంలో రైళ్లకు విపరీతమైన రద్దీ ఉంటుంది. ముందుగానే అడ్వాన్స్ టిక్కెట్లు బుక్ అయ్యాయి. ఏ రైలు చూసినా బెర్త్ లు ఖాళీగా లేవు. అయితే దక్షిణ మధ్య రైల్వే సమ్మర్ లో స్పెషల్ ట్రైన్స్ ను ప్రవేశపెట్టింది. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి అనేక ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రధానంగా కేరళ, పశ్చిమ బెంగాల్, బెంగలూరు, సాంత్రాగాచి వంటి ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక రైళ్లు ఇలా...
కేరళలోని కొల్లం, పశ్చిమ బెంగాల్ లోని షాలిమార్ ప్రాంతాలకు కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. సాంత్రాగాచికి ట్రైన్ ప్రతి శుక్రవారం సికింద్రాబాద లో బయలు దేరుతుందని తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుంచి జూన్ 29 వరకు 11 ట్రిప్పులు ఈ రైలు నడుస్తుందని పేర్కొన్నారు. ప్రతి శనివారం సాంత్రాగాచి తిరుగు ప్రయాణమవుతుందని తెలిపారు. ఈ రైలు ఏప్రిల్ 20వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకూ నడుస్తుందని తెలిపింది. మొత్తం పదకొండు ట్రిప్పులు ఈ రైలు ప్రయాణిస్తుందని చెప్పారు. షాలిమార్ కు వెళ్లే ప్రత్యేక రైలు ఈ నెల 15వతేదీ నుంచి ప్రతి సోమవారం బయలుదేరనుంది. ఇది కూడా షాలిమార్ నుంచి ఏప్రిల్ 16వ తేదీ నుంచి జూన్ 25వ తేదీ వరకూ నడుస్తుందని తెలిపారు. కొల్లం ట్రైన్ కూా సికింద్రాబాద్ నుంచి ఏప్రిల్ 17, 24, మే 1,8, 15, 22, 29, జూన్ 5, 12, 19, 26 తేదీల్లో నడుస్తుందన్నారు. ఈ రైలు నల్లగొండ, మిర్యాల గూడ స్టేషన్ లలో ఆగనుంది.
Next Story