Sun Dec 22 2024 16:28:56 GMT+0000 (Coordinated Universal Time)
నేడు, రేపు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. రీజన్ ఇదే
ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది
ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు జరుగుతున్నందున శని, ఆదివారాల్లో కొన్ని ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. శని, ఆదివారాలలో నడవాలసిన కొన్ని ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ప్రత్యామ్నాయ మార్గాలను...
ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే వారు ప్రత్యామ్యాయ మార్గాలను ఎంచుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. అయితే రద్దు చేసిన రైళ్లను తిరిగి సోమవారం నుంచి ప్రారంభిస్తామని, కేవలం శని, ఆదివారాలు మాత్రమే కొన్ని రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సోమవారం నుంచి అన్ని రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
Next Story