Thu Dec 19 2024 03:05:47 GMT+0000 (Coordinated Universal Time)
గాంధీ సినిమా చూసేందుకు వచ్చి విధ్వంసం
హైదరాబాద్ లో ప్రియా థియేటర్ లో విద్యార్థులు విధ్వంసం సృష్టించారు. థియేటర్లలో సీట్లు చించేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు
హైదరాబాద్ మల్లేపల్లిలోని ప్రియా థియేటర్ లో విద్యార్థులు విధ్వంసం సృష్టించారు. థియేటర్లలో సీట్లు చించేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. దీంతో థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియా థియేటర్ లో గాంధీ సినిమాను చూసేందుకు మెహిదీపట్నం ఎంఎస్ కళాశాలకు చెందిన 500 మంది విద్యార్థులు వచ్చారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేళ ప్రభుత్వం విద్యార్థులకు గాంధీ సినిమాను చూపించాలని ఆదేశించింది.
థియేటర్ యాజమాన్యం....
అయితే గాంధీ సినిమాను చూసేందుకు వచ్చిన ఎంఎస్ కళాశాల విద్యార్థులు విధ్వంసానికి పాల్పడ్డారు. సీట్లను చించివేశారు. సీసీ కెమెరాలను పగుల కొట్టారు. థియేటర్ యాజమాన్యం వద్దని వారిస్తున్నా వినలేదు. దీంతో ప్రియా థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు. అసలు విద్యార్థులు ఈ చర్యకు దిగడానికి కారణాలేంటన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Next Story