Mon Dec 23 2024 10:29:56 GMT+0000 (Coordinated Universal Time)
హెచ్సీయూలో విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై అయిన విద్యార్థుల నుంచి అధిక ఫీజులను వసూలు చేస్తున్నారంటూ విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో క్వాలిఫై అయిన విద్యార్థుల నుంచి గతంలో రూ.600 ఫీజు వసూలు చేసేవారు. కానీ ఈ ఏడాది అప్లికేషన్ ఫీజుతో సబ్జెక్టుకు రూ.600లు వసూలు చేయాలని నిర్ణయించడాన్ని విద్యార్థులు తప్పు పడుతున్నారు.
అధిక ఫీజులపై....
1,57,000 మంది నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. ఆ డబ్బులను తిరిగి ఇచ్చేంత వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. అయితే యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది, విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. హెచ్సీయూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలు ఈ విషయంపై వైస్ ఛాన్సిలర్ తో చర్చించేందుకు వెళ్లగా అక్కడ సెక్యూరిటీ సిబ్బంది తోసేశారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Next Story