Thu Dec 26 2024 01:58:06 GMT+0000 (Coordinated Universal Time)
VivahaBhojanambu: వివరణ ఇచ్చిన సందీప్ కిషన్ రెస్టారెంట్ యాజమాన్యం
తెలుగు హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్ 'వివాహ భోజనంబు' పై అధికారులు తనిఖీలు
తెలుగు హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్ 'వివాహ భోజనంబు' పై అధికారులు తనిఖీలు నిర్వహించారు. అందులో అనేక ఆహార భద్రత ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయని ప్రకటన వచ్చింది. భారత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ (FSSAI) అధికారులు వివాహ భోజనంబు రెస్టారెంట్ కు నోటీసులు దాఖలు చేశారు. FSSAI టాస్క్ ఫోర్స్ రెస్టారెంట్ సికింద్రాబాద్ శాఖను తనిఖీ చేసింది. తక్షణమే పరిష్కరించాల్సిన అనేక సమస్యలను గుర్తించింది. దీనిపై వివాహ భోజనంబు రెస్టారెంట్ యాజమాన్యం స్పందించింది.
కిచెన్ చాలా అశుభ్రంగా ఉందంటూ కొందరు ఫొటోలు షేర్ చేస్తున్నారని.. అందులో ఏ మాత్రం నిజం లేదని తెలిపింది వివాహ భోజనంబు టీమ్. ఆ ఫొటోలు తమ రెస్టారెంట్ కు చెందినవి కావని ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. దయచేసి మీడియా మిత్రలు ఆసక్తికరమైన హెడ్ లైన్స్ పెట్టి వార్తలు రాసే ముందు నిజాలు తెలుసుకోవాలి.. మేం గత ఎనిమిదేళ్లుగా వివాహ భోజనంబు అనే పేరుతో చాలా నమ్మకమైన సేవలు అందిస్తూ వస్తున్నాం. మీ ప్రేమాభిమానాలను ఎప్పుడూ వృధా కానీవ్వలేదు. 2022 ఎక్స్పైరీ డేట్ తో ఉన్న చిట్టి ముత్యాలు రైస్ బ్యాగ్ తమ హోటల్ లో ఉన్న మాట వాస్తవమే. కానీ అది ఇప్పటివరకు సీల్ తీయని ఒక శాంపిల్ బ్యాగ్ అంటూ వివరణ ఇచ్చారు సందీప్ కిషన్.
మా కిచెన్ లో నీళ్లు నిలిచిపోయాయన్నట్టుగా ప్రచారం జరుగుతోందని.. అవి బయటకు వెళుతూ ఉండగా తీసిన ఫొటోస్ అని తెలిపింది రెస్టారెంట్ యాజమాన్యం. ప్రతి గంట గంటకు కిచెన్ క్లీన్ చేస్తూనే ఉంటామని.. టేస్టింగ్ సాల్ట్స్ వంటివి అసలు ఉపయోగించమని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కుకింగ్ అండ్ సేఫ్టీకి సంబంధం లేని చిన్న చిన్న విషయాలను మాత్రమే గుర్తించారని.. వాటిని కూడా మేం సరిదిద్దుకునే పనిలో ఉన్నామన్నారు.
Next Story