Mon Dec 23 2024 08:57:06 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ
నేడు హైదరాబాద్లో రాజీన్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు
నేడు హైదరాబాద్లో రాజీన్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. తెలంగాణ సచివాలయం ఎదుట ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు ఈ విగ్రహావిష్కరణ చేయనున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదుట నిర్మించాలని ఎనిమిది నెలల క్రితం ఏర్పాటయిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పూర్తి చేశారు.
సచివాలయం ఎదుట...
అయితే ఈరోజు సాయంత్రం ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ముహూర్తంగా నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విగ్రహం అక్కడ ఏర్పాటును బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పోలీసుఅు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సచివాలయం చుట్టుపక్కల ప్రాంతాలకు ఎవరినీ రానివ్వకుండా అడ్డుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అనుమానం ఉన్న బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేసే అవకాశముంది.
Next Story