Revanth Reddy: కేసీఆర్‌ను పరామర్శించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రస్తుతం సోమాజిగూడలోని
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రస్తుతం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను పరామర్శించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించనున్నారు. శుక్రవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో కేసీఆర్‌కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ నిర్వహించింది. ఆ తర్వాత ఆయనను పలువురు నాయకులు ఆసుపత్రిలో పరామర్శిస్తున్నారు.
సర్జరీ నిర్వహించిన వైద్యులు నాలుగు వారాల పాటు విశ్రాంతి అవసరమని చెరు. ప్రస్తుతం వాకర్ సాయంతో కేసీఆర్ నడుస్తున్నారు వైద్యులు. మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వారు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, త్వరగా కోలుకోవడానికి అనుకూలంగా శరీరం సహకరిస్తోందన్నారు. మానసికంగా కూడా కేసీఆర్ దృఢంగా ఉన్నారని తెలిపారు.
ఆదిలా ఉండగా, గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కేసీఆర్ ఎర్రవల్లి గ్రామంలోని తన ఫామ్‌హౌస్‌లో జారిపడ్డారని తెలిసింది. దాంతో ఆయన తుంటికి గాయమైంది. హుటాహుటిన యశోదా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అయితే.. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు వివరాలు ఆరా తీసారు. కేసీఆర్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.