Thu Apr 17 2025 05:27:13 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఇక ప్రయాణం సులువు
హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది.

హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లై ఓవర్ ను నేడుప్రారంభించనున్నున్నారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో హైదరాబాద్ లోకి బెంగళూరు నుంచి వచ్చే వాహనాలు సులువుగా నగరంలోకి ప్రవేశిస్తాయి. నేరుగా ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా నేరుగా ఈ ఫ్లై ఓవర్ మీదుగా నగరంలోకి రావచ్చు. ఎన్ఆర్టీపీ ప్రాజెక్టులో భాగంగా కొత్త ప్రాజెక్టులు నగరవాసులకు అందుబాటులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్, వరంగల్, భువనగిరి, మేడ్చల్,హుజురాబాద్, మాల్కాజ్ గిరి ప్రాంత వాసులకుశంషాబాద్ విమానాశ్రాయానికి వెళ్లేందుకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణాన్ని పొందే అవకాశముంది.
నగరంలో రెండో అతి పెద్ద...
నాలుగు కిలోమీటర్ల పొడవున్న ఈ ఫ్లైఓవర్ ను 799 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. నగరంలో నిర్మించిన అతి పెద్ద ఫ్లైఓవర్ లో ఇది రెండోది. మొదటిది పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్ కాగా, రెండోది ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లై ఓవర్. హదరాబాద్ నగరంలోకి ఇక సులువుగా ప్రవేశించడానికి, బెంగళూరు హైవేపైకి చేరుకునేందుకు అలాగే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోవడానికి ఈ ఫ్లైఓవర్ పూర్తికావడంతో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. ఈ ఫ్లైఓవర్ కు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభించిన తర్వాత రాకపోకలకు సులువుగా మారనున్నాయి. దీంతో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం గత కొన్ని నెలలుగా సాగుతుండటంతో ఈ ప్రాంత వాసులు కొంత ఇబ్బంది పడుతున్నారు. వారికి కూడా ఈ రోజు నుంచి ఆ ఇబ్బందుల నుంచి విముక్తి లభించనుంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story