Wed Dec 25 2024 14:23:57 GMT+0000 (Coordinated Universal Time)
Covid Cases : హైదరాబాద్ లో పెరుగుతున్న కేసులు... రీజన్ ఇదేనట
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. తాజాగా మరో ఎనిమిది కేసులు నమోదయ్యాయి
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. తాజాగా మరో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 63కు చేరుకుంది. 1333 టెస్ట్లు చేయగా అందులో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ గా నమోదయింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎక్కువగా జనం చేరుతుండటం వల్ల కూడా కేసుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో పలువురు కరోనా చికిత్స పొందుతున్నారు. రెండు మరణాలు కూడా సంభవించడం మరింత ఆందోళనకు దారితీస్తుంది.
ఇతర రాష్ట్రాల నుంచి....
తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. కేరళ, కర్ణాటక నుంచి వచ్చే వారి నుంచే ఈ కేసుల వ్యాప్తి ఎక్కువగా జరుగుతుందన్న భావన కూడా వైద్య వర్గాల నుంచి వ్యక్తమవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా నమోదయిన 63 కేసులలో ఒక్క హైదరాబాద్లోనే 53 కేసులు నమోదు కావడం విశేషం. బస్సుల్లో రద్దీ, మెట్రోలో రద్దీ ఇలా అన్ని చోట్ల జనసమ్మర్థం ఎక్కువగా ఉండటం వల్లనే కరోనా కేసులు పెరుగుతున్నాయని భావిస్తున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
Next Story