Mon Dec 23 2024 07:23:49 GMT+0000 (Coordinated Universal Time)
అనవసరంగా డైరెక్టర్ క్రిష్ పేరు.. పోలీసులు చెబుతోంది ఇదే!!
గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్ వినియోగించిన కేసులో హైదరాబాద్కు చెందిన
గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్ వినియోగించిన కేసులో హైదరాబాద్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, మంజీరా గ్రూప్ చైర్మన్ గజ్జల యోగానంద్ కుమారుడు, ఆ సంస్థ డైరెక్టర్ గజ్జల వివేకానంద్ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే డైరెక్టర్ క్రిష్ కూడా ఈ పార్టీకి వెళ్లారంటూ కొందరు ప్రచారం చేశారు. ఈ వార్తలపై పోలీసులు వివరణ ఇచ్చారు.
రాడిసన్ హోటల్లో జరిగిన పార్టీలో టాలీవుడ్ దర్శకుడు క్రిష్ పాల్గొన్నట్లుగా నిర్ధారణ కాలేదని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో దర్యాఫ్తు కొనసాగుతోందని అన్నారు. రాడిసన్ హోటల్లో చాలాసార్లు పార్టీలు చేసుకున్నట్లు నిందితులు చెప్పినట్లు తెలిపారు. వివేకానంద, కేదార్, నిర్భయ్లు కొకైన్ సేవించినట్లుగా పరీక్షల్లో తేలిందన్నారు. మిగిలిన వారికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వివేకానందకు అబ్బాస్ పదిసార్లు కొకైన్ సరఫరా చేసినట్లు దర్యాఫ్తులో తేలిందన్నారు. కేసులో నిందితులైన లిపి, శ్వేత, సందీప్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. చరణ్ బెంగళూరులో ఉన్నట్లు తేలిందన్నారు. దర్శకుడు క్రిష్ విచారణకు హాజరవుతానని చెప్పినట్లు డీసీపీ వినీత్ వెల్లడించారు.
Next Story