Fri Dec 20 2024 17:52:34 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి మద్యం షాపులు బంద్
తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 48 గంటల పాటు మద్యం దుకాణాలను మూసివేస్తారు
తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో 48 గంటల పాటు మద్యం దుకాణాలను మూసివేస్తారు. 48 గంటల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉన్నాయి. హోలీ పండగ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈరోజు సాయంత్ర 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం ఆరు గంటల వరకూ అంటే 48 గంటల పాటు మద్యం దుకాణాలు తెరుచుకోవు.
అన్నీ బంద్....
బార్లు, వైన్స్, కల్లుదుకాణాలన్నీ మూసివేయాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి హోలీకి మద్యం దుకాణాలను మూసివేస్తారు. అలాగే ఈ ఏడాది కూడా మద్యం దుకాణాలను మూసివేయడంతో పాటు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలను కూడా అమలు చేయనున్నారు.
Next Story