Fri Nov 15 2024 06:23:05 GMT+0000 (Coordinated Universal Time)
లంచం తీసుకుంటూ పట్టుబడిన తెలంగాణ యూనివర్సిటీ వీసీ
అవినీతి ప్రతిచోటా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు జరిగే అవినీతి ఘటనలు వెలుగులోకి వస్తుంటాయి.
సమాజంలో మార్పు తెచ్చేలా.. విద్యార్థులకు బోధించే పాఠాల్లో, పరిశోధనలు అందించాల్సిన విశ్వవిద్యాలయాలు కూడా అడ్డదారులు తొక్కుతున్నాయి. అవినీతి ప్రతిచోటా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు జరిగే అవినీతి ఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. ఫలితంగా ఆ సంస్థ లేదా యూనివర్సిటీపై మచ్చ పడుతుంది. తాజాగా తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛైన్స్ లగా పనిచేస్తున్న ప్రొఫెసర్ రవీందర్ గుప్తా లంచం తీసుకుంటూ.. ఏసీబీ వలకు చిక్కారు. శనివారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో రవీందర్ గుప్తా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
గతవారమే ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ నేరుగా ఆయన ఇంటికెళ్లి తనిఖీలు చేసింది. ఛాంబర్లో గంటల సమయం సోదాలు చేసింది. ఈ సోదాల్లో ఎలాంటి వివరాలు సేకరించారన్నది మాత్రం వెల్లడించలేదు. తాజాగా.. నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండల కేంద్రంలో పరీక్ష సెంటర్ కు అనుమతి ఇవ్వడానికి రూ.50,000 లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఇంట్లో తనిఖీలు చేసి.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీసీని ఏసీబీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
Next Story