Mon Dec 23 2024 11:34:21 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : బేగంపేట్ కు చేరుకున్న బాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో చేరుకున్న ఆయనకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దయెత్తున స్వాగతం పలికారు. జై బాబు అంటూ నినాదాలతో బేగంపేట పరిసర ప్రాంతాలన్నీ దద్దరిల్లి పోయాయి. హైదరాబాద్ లో ఉన్న ఆయన అభిమానులంతా వచ్చి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. పూలవర్షం కురిపించారు. ఆయన కాన్వాయ్ వద్ద నిలబడి పెద్దయెత్తున నినాదాలు చేశారు.
ఘన స్వాగతం...
చంద్రబాబు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి వెళతారు. రేపు ఏఏజీ ఆసుపత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. ఆ తర్వాత రేపు ఆయనకు ఎల్. వి. ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ లో పరీక్షలు నిర్వహిస్తారు. గత యాభై రెండు రోజుల నుంచి స్కిల్ డెవలెప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు అనారోగ్య కారాణాల రీత్యా హైకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు.
Next Story