Mon Dec 23 2024 15:05:32 GMT+0000 (Coordinated Universal Time)
నగరంలో భారీ కొండచిలువ.. టెన్షన్ పడ్డ జనం
నగరంలో భారీ కొండ చిలువ జనాన్ని టెన్షన్ పెట్టింది. నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్
నగరంలో భారీ కొండ చిలువ జనాన్ని టెన్షన్ పెట్టింది. నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఎన్ఆర్ఐ కాలనీలో సాయి ఎలైట్ అపార్ట్ మెంట్ లో కొండచిలువ హల్ చల్ చేసింది. అపార్ట మెంట్ సెల్లార్ లోకి తొమ్మిది అడుగుల కొండ చిలువ రావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అపార్ట్మెంట్ వాసులు స్నేక్ క్యాచర్ కి సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్ వచ్చి కొండచిలువను బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రెండో డివిజన్లో పెద్ద కొండచిలువ కనిపించింది. సాయి ఎలైట్ అపార్ట్మెంట్, ఎన్నారై కాలనీలో ఈ కొండచిలువ చొరబడడంతో స్థానికులు ఆందోళన చెందారు. అపార్ట్మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే సేవ్ స్నేక్ బృందానికి సమాచారం అందించారు. వెంటనే సేవ్ స్నేక్ బృందం సాయి లైట్ అపార్ట్మెంట్ కి చేరుకొని అక్కడ ఉన్న కొండచిలువను పట్టుకున్నారు. భారీ వర్షాలు పడడంతో సమీప ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో పాములు, కొండచిలువలు ఇలా అపార్ట్మెంట్లలోకి వస్తున్నాయి.
Next Story