Sat Apr 12 2025 11:39:59 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : కర్మన్ ఘాట్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ లోని కర్మన్ఘాట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భజరంగ్ దళ్ కార్యకర్తలపై కొందరు కత్తులతో దాడికి దిగారు

హైదరాబాద్ లోని కర్మన్ఘాట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భజరంగ్ దళ్ కార్యకర్తలపై గోవులను తరలించేవారు కత్తులతో దాడికి దిగారు. దీంతో భజరంగ్దళ్ కార్యకర్తలతో పాటు బీజేపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో కర్మన్ ఘాట్ ఆంజనేయస్వామి గుడికి చేరుకున్నారు.
పోలీసులు లాఠీఛార్జి.....
గోవులను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం తో భజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే వాహనంలో ఉన్న దుండగులు కొందరు కత్తులతో దాడికి దిగారు. దీంతో భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆంజనేయ స్వామి గుడిలోకి పరుగులు తీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. భజరంగ్ దళ్ కార్యకర్తలు పోలీసులపై రాళ్లదాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం పరిస్థిితి అదుపులోకి వచ్చిందని పోలీసు అధికారులు చెప్పారు.
Next Story