Wed Apr 16 2025 21:44:25 GMT+0000 (Coordinated Universal Time)
ఓయూ లో ఉద్రిక్త వాతావరణం .. విద్యార్థుల అరెస్ట్
ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఓయూ లో నిరసనలు, ఆందోళనలు నిషేధిస్తూ జారీ అయిన ఉత్తర్వుల పై ఆందోళనకు విద్యార్థి సంఘాలు దిగాయి. ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని అన్ని విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నారు. ఓయూ విసీ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ఎత్తున ర్యాలీ చేస్తున్నారు.
ఆంక్షలు విధించామంటూ...
ఐక్య విద్యార్థి సంఘాలు ర్యాలీలో పాల్గొన్నారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థుల సంఘాల నిరసన తెలియజేయడంతో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో లకు తరలించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఆంక్షలు విధించామని చెబుతున్నప్పటికీ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Next Story