Sun Dec 22 2024 18:25:46 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం ...ఏడుగురి మృతి
హైదరాబాద్ లోని నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు
హైదరాబాద్ లోని నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బజార్‌ఘాట్ లోని కెమికల్ గోదాములో చెలరేగిన మంటలు నాలుగు అంతస్థుల వరకూ అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. విగ్రహాల తయారీకి వినియోగించే కెమికల్ కు మంటలు అంటుకోవడంతో ప్రమాదం మరింత పెరిగింది. మూడు అగ్నిమాపక వాహనాలు సంఘటన స్థలికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పదిహేను మంది వరకూ సిబ్బంది రక్షించారని చెబుతున్నారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. రెసిడెన్షియల్ ప్రాంతం కావడంతో సహాయ కార్యక్రమాలు కూడా కష్టంగా మారాయి.
కెమికల్ డ్రమ్ములకు...
కెమికల్ డ్రమ్ములకు మంటలు అంటుకోవడంతో ఈ ఘోర విపత్తు సంభవించింది మృతులందరూ కార్మికులేనని చెబుతున్నారు. కార్మిక కుటుంబాలన్నీ ఈ భవనంలో ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అక్కడ నిలిపి ఉంచిన వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. నాలుగో అంతస్థులో చిక్కుకున్న వారిని కొందరిని రక్షించారు. కారును రిపేరు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని ప్రాధమికంగా నిర్ధారణ అయింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
Next Story