Fri Mar 21 2025 01:24:41 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు స్పాట్ డెడ్
హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు

హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. హైదరాబాద్ లోని ఫ్లైఓవర్ పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మైనర్లు అతి వేగంగా వచ్చి బైక్ ఎలక్ట్రిక్ పోల్ ను ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. బహుదూర్ పురా కు చెందిన ముగ్గురు మైనర్లు బైక్ పై అరంఘర్ కు వెళుతుండగా శివరాంపల్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
ఓవర్ స్పీడ్ తో...
ఓవర్ స్పీడ్ తో వెళుతుండటతో అదుపు తప్పిన ద్విచక్ర వాహనం తొలుత ఎలక్ట్రిక్ పోల్ ను ఢీకొట్టింది. తర్వాత డివైడర్ ను ఢీకొట్టింది. ముగ్గురు రోడ్డుపై పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు తెలిపారు. వీరి మృతితో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story