Tue Nov 19 2024 06:51:31 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో ఫార్ములా- ఈ రేస్ కు ముహూర్తం ఖరారు
హైదరాబాద్ లో ఇప్పటి వరకూ క్రికెట్ మ్యాచ్ లు, బ్యాడ్మింటన్ టోర్నీలు.. ఇలా పలు క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. రాబోయే రోజుల్లో వేగంగా వెళ్లే కార్ రేస్ లకు కూడా ఆతిథ్యం ఇవ్వనుంది.
హైదరాబాద్ లో ఇప్పటి వరకూ క్రికెట్ మ్యాచ్ లు, బ్యాడ్మింటన్ టోర్నీలు.. ఇలా పలు క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. రాబోయే రోజుల్లో వేగంగా వెళ్లే కార్ రేస్ లకు కూడా ఆతిథ్యం ఇవ్వనుంది. 'ఫార్ములా- ఈ' రేస్ హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 11, 2023న హైదరాబాద్ ఈ-ప్రిక్స్ నిర్వహించనున్నారు. ఫార్ములా- ఈ మొదటిసారిగా భారతదేశంలో నిర్వహించనున్నారు. ఈ వార్తను ధృవీకరిస్తూ, ఫార్ములా- ఈ సీజన్ 9 కోసం తాత్కాలిక క్యాలెండర్‌ను ప్రచురించింది.
'ఫార్ములా ఈ-రేస్' చాంపియన్‌షిప్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్‌లో జరుగుతుందని ప్రపంచ మోటార్ క్రీడల సమాఖ్య అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. 'ఫార్ములా ఈ' సీఈవో హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఆయనతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. దేశంలో జరిగే మొదటి 'ఈ-రేస్' కు ఆతిథ్యం ఇస్తున్న నగరంగా హైదరాబాద్ రికార్డు సృష్టించనుంది. 2011 నుంచి 2013 వరకు గ్రేటర్ నోయిడాలోని బుద్ద్ అంతర్జాతీయ సర్క్యూట్లో ఫార్ములా వన్ రేసు జరిగిన తర్వాత దేశంలో జరగబోగే రెండో అతి పెద్ద రేసింగ్ ఈవెంట్ ఇదే కానుంది. ట్యాంక్ బండ్, నెక్లస్ రోడ్డు మీదుగా పోటీలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభత్వం ఏర్పాట్లు చేయనుంది. విద్యుత్ కార్లతో జరిగే ఈ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం జనవరిలో 'ఫార్ములా ఈ' సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఫార్ములా1 లాగా 'ఈ–రేస్'కు ప్రత్యేక ట్రాక్ అవసరం ఉండదు. సాధారణ రోడ్లపైనే బ్యాటరీ కార్లతో రేసింగ్ నిర్వహించనున్నారు. 2014–15లో ఈ పోటీలు మొదలయ్యాయి. భారత్ నుంచి మహింద్రా కంపెనీకి చెందిన 'మహింద్ర రేసింగ్' జట్టు పోటీ పడుతోంది. మహీంద్రా రేసింగ్, జాగ్వార్, DS ఆటోమొబైల్స్, నిస్సాన్, పోర్షే మరియు NIO 333లతో పాటు మాసెరటి, మెక్లారెన్లు కూడా ఛాంపియన్‌షిప్‌లో పోటీ పడతాయి. 2.37కిమీ ట్రాక్‌ను డ్రైవెన్ ఇంటర్నేషనల్ రూపొందించింది. అబుదాబిలోని యాస్ మెరీనా సర్క్యూట్‌కు ఇటీవలి అప్డేట్లపై కూడా పనిచేశారు. ఈ సంస్థ భారతదేశంలోని ఇతర ప్రాజెక్ట్‌లలో కూడా పని చేస్తోంది. పూణే సమీపంలోని నానోలి స్పీడ్వే, ఆంధ్రప్రదేశ్‌లోని మార్క్ వన్ మోటార్ క్లబ్ ల విషయంలో కూడా ఈ సంస్థ పని చేస్తోంది.
ఈ ట్రాక్ హుస్సేన్ సాగర్ సరస్సు పక్కన లుంబినీ పార్క్ గుండా వెళుతుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో మహీంద్రా రేసింగ్ సీఈఓ, టీమ్ ప్రిన్సిపాల్ దిల్బాగ్ గిల్ మాట్లాడుతూ.. రేసింగ్ కు ఇది అనువైన ప్రదేశం అని అన్నారు. "ఇది సిటీలో రేస్ పాయింట్ అయినప్పటికీ.. ట్రాక్ ప్రాంతం కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ట్రాక్ కారణంగా ప్రజా జీవితానికి అంతరాయం కలిగించడం లేదు" అని ఆయన వివరించారు. సాయంత్రం లైట్ల వెలుగులో హైదరాబాద్ ఈ-ప్రిక్స్ నిర్వహించాలని నిర్వాహకులు చూస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ ట్రాక్ ఈ ఏడాది నవంబర్, డిసెంబర్లలో F4 ఇండియా, ఇండియన్ రేసింగ్ లీగ్‌తో పాటుగా ప్రారంభ ఫార్ములా రీజినల్ ఇండియన్ ఛాంపియన్షిప్ రెండు రౌండ్లను కూడా నిర్వహిస్తుంది.
News Summary - Hyderabad E-Prix confirmed: Formula E to race in India
Next Story