Sun Dec 22 2024 17:46:28 GMT+0000 (Coordinated Universal Time)
Toll Plaza : టోల్ ప్లాజాల వద్ద కొనసాగుతున్న రద్దీ
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది
రేపు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో తెలంగాణ నుంచి ఓటర్లు క్యూకట్టారు. బస్సులు, రైళ్లలో వెళ్లలేని వారు సొంత వాహనాల్లో బయలుదేరారు. ప్రయివేటు బస్సుల్లో నలుగురు వెళ్లాలంటే సొంత వాహనంలో వెళ్లి రావడం బెటర్ అని భావించి చాలా మంది కార్లలో బయలుదేరారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. సంక్రాంతి పండగ రష్ ను గత రెండు రోజుల నుంచి తలపిస్తుందంటున్నారు.
వర సెలవులు రావడంతో...
వరసగా మూడు రోజులు సెలవులు రావడంతో అందరూ ఇళ్లకు బయలేదేరారు. రెండు రోజుల నుంచి వాహనాల రద్దీ ఎక్కువగా ఉందని టోల్ ప్లాజా నిర్వాహకులు చెబుతున్నారు. విజయవాడ వైపునకు వెళ్లే వాహనాలకు వీలుగా అత్యధిక ద్వారాలు తెరిచారు. ఫాస్టాగ్ సౌకర్యం ఉన్నా టోల్ ప్లాజాను దాటడానికి అధిక సమయం పడుతుంది. దీంతో వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద గంటల పాటు నిరీక్షిస్తున్నారు. ఈ రద్దీ సాయంత్రం వరకూ ఇలాగే ఉంటుందని చెబుతున్నారు.
Next Story